Rashid Khan : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ జట్టు రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోంది. వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన కొద్ది రోజులకే పాకిస్థాన్ లాంటి జట్టును కూడా ఆప్ఘనిస్తాన్ చావుదెబ్బ తీసింది. అనూహ్యంగా పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లంతా కనివినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై గెలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ మైదానంలోనే డ్యాన్సులు కూడా చేశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆప్ఘనిస్తాన్‌కు ఇది కేవలం మూడో విజయం మాత్రమే.
2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన తర్వాత 2023 వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 2019లో అయితే ఆడిన 9 మ్యాచ్‌లలోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దీంతో ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ అంటే గెలుపు సులువేనని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి టైటిల్ ఫేవరెట్లను ఓడించడంతో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ అంటే అన్ని జట్లు వణికిపోతున్నాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా ఆషామాషీ మ్యాచ్‌లో కాకుండా ప్రపంచకప్‌లోనే పాక్ పని పట్టింది. దీంతో అఫ్ఘానిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. చెపాక్ మైదానం కలియ తిరుగుతూ సెలబ్రేట్ చేసుకున్నారు అఫ్ఘాన్ ఆటగాళ్లు. అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అయితే ఇర్ఫాన్ పఠాన్‍తో కలిసి గ్రౌండ్లోనే స్టెప్పులు వేశాడు.
టీమ్ బస్సు ఎక్కిన తర్వాత కూడా సెలబ్రేషన్స్ కొనసాగాయంటే.. ఆ గెలుపు వారికి ఇచ్చిన మజా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బస్సులో కింగ్ ఖాన్.. లుంగీ డ్యాన్స్ పాటకు అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ పాటకు ఫుల్ జోష్‌లో గెంతులేస్తూ అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్ కనిపించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసి సందడి చేసారు. రషీద్ ఖాన్ చేసిన డ్యాన్స్ వీడియ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…