పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాబి.. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేశారు బాబి.. అదే వాల్తేరు వీరయ్య.. జనవరి 13వ తేదీన అంటే ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించగా.. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించబడింది.. చాలాకాలం తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించడంతో అభిమానులలో మంచి జోష్ పెరిగిందని చెప్పవచ్చు. పూల చొక్కా .. లుంగీ తో చిరంజీవి వింటేజ్ లుక్.. కామెడీ టైమింగ్.. మరోసారి ఈ సినిమాలో రీ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
మాస్ కమర్షియల్ అంశాలతో వాల్తేరు వీరయ్య రంగంలోకి దూకారు. సంక్రాంతి రేసులో వీర సింహారెడ్డి గట్టి పోటీ ఇచ్చేందుకు బరిలో నిలిచారు. ఈ రెండు పెద్ద సినిమాలు కావడంతో ఈ ఏడాది థియేటర్ల వద్ద సంక్రాంతి శోభ విరజిమ్ముతోంది. బాబీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనే టాక్ వచ్చింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా.. ఓటీటీ హక్కులపై అప్డేట్ కూడా ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇంకా డిసైడ్ కాలేదు. కానీ ఒకవేళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే దాదాపు 6 వరాల తర్వాతే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య కథ విషయానికి వస్తే.. వీరయ్య అనే మత్స్యకారుడి పాత్రలో చిరంజీవి నటించి మెప్పించారు. అతనికి డ్రగ్ డీలర్స్ కు సంబంధాలతో పాటు ఐపీఎస్ అధికారి విక్రమ్ సాగర్ తనకు మధ్య గొడవలు ఉన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. నిజానికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనే ట్విస్ట్ కూడా లాస్ట్ లో రివీల్ చేశారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…