టాలీవుడ్ టాప్ దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు .సృష్టికి ప్రతిసృష్టి చేసాడు కోడి రామకృష్ణ. అలా చేసిన ఏకైక దర్శకుడు ఈయనే అయ్యుంటాడు కూడా. ఎందుకంటే చనిపోయిన హీరోతో మళ్లీ ఓ సినిమా చేసి ఔరా అనిపించాడు ఈ దర్శకుడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో పక్కాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి.. కానీ ఈయన కంటే ముందే తెలుగు ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ.అసలు గ్రాఫిక్స్ అంటే ప్రేక్షకులకు తెలియని కాలంలోనే అమ్మోరుతో అద్భుతం చేసాడీ దర్శకుడు. ఆ సినిమాలో వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ కు అప్పట్లో ప్రేక్షకులు నోరెళ్లబెట్టడం తప్ప ఏం చేయలేకపోయారు.
ఆ తర్వాత అంజి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు కోడి. అరుంధతి సంచలనం గురించి ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అరుంధతితో సంచలనం సృష్టించారు కోడి రామకృష్ణ. చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్న ఈయన.. మూడేళ్ల కింద నాగభరణం అనే సినిమా చేసాడు. ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్ కనిపిస్తాయి ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు. దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పని చేసిన కోడి రామకృష్ణ తన తొలి చిత్రంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో రెండో చిత్రానికి పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. కోవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా చిత్ర షూటింగ్ జరుపుతున్నారు కోడి రామకృష్ణ. ఆ సమయంలో అక్కడికి ఎన్టీ రామారావు కాస్ట్యూమర్ మోకా రామారావు వచ్చారట. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో సినిమా చేస్తున్న కోడిని చూసిన ఆయన మీ నుదురు ఎండకి కాలిపోతుంది అని తన జేబులో ఉన్న రుమాలు ఇచ్చారట.ఆ రోజంతా ఆ రుమాలుని అలానే ఉంచుకున్న కోడి రామకృష్ణ తర్వాతి రోజున బ్యాండ్‌లా తయారు చేసి కట్టుకున్నారట. ఇది మీకు బాగా సూట్ అయింది. దీనిని కట్టుకోకుండా ఉండొద్దు అని మోకా రామారావు చెప్పారట. ఇక అప్పటి నుండి ఆయనకి ఈ తల బ్యాండ్ సెంటిమెంట్‌గాను మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…