మెగాస్టార్ చిరంజీవి చివరి చిత్రం గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కగా, ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు. అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరు సల్మాన్ ఖాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
అయితే పవన్ బదులు సల్మాన్‌ని ఆ సినిమాలో తీసుకోవడం వెనక అసలు కారణం హిందీ లో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే అని తెలుస్తుంది. అయితే సల్మాన్ క్రేజ్ మిగతా భాషల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అసలు సల్మాన్ స్థానంలో పవన్ నటించి ఉంటే మెగా అన్నదమ్ముల ఇద్దరినీ ఒకే టైం లో తెరపై చూస్తే ఆ “కిక్కే వేరబ్బా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విషయంపై దర్శకుడు మోహన్ రాజా ఇటీవల మాట్లాడుతూ.. ”నేను దీనిని సినిమాగా చూసా అని పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచనలేదు.
ఫ్యామిలీలో హీరో చెప్పడం కంటే, బయట నుండి స్టార్ గురించి చెప్పడం బాగుంటుంది అని నేను అనుకున్నా.అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను అని ఆయన అన్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…