కమలినీ ముఖర్జీ.. అచ్చ తెలుగు ఆడపడుచులా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేది. నిజానికి ఆమె బెంగాలీ హీరోయిన్. గోదావరి, ఆనంద్, గమ్యం లాంటి సినిమాల్లో ఎంతో అందంగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గోదావరి, ఆనంద్ సినిమాల్లో ఆమె అందం, అభినయం కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది. రూప క్యారెక్టర్ తో పాటు గోదావరిలో చేసిన సీతామహాలక్ష్మీ పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎవర్నైనా ప్రశ్నించే అమ్మాయిగా.. అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనేలా ఎంతోమంది అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. చేసింది నాలుగు సినిమాలే అయినా సినిమా లవర్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. జల్సా, హ్యాపీడేస్, గోవిందుడు అందరివాడే సినిమాల్లో గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసింది.
కొన్నాళ్లుగా కమలినీ ముఖర్జీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అమెరికాలో తన బిజినెస్ లు చూసుకుంటూ సెటిల్ అయ్యారు. అప్పట్నుంచి సోషల్ మీడియాకు కూడా దూరం అయ్యింది ఈ బ్యూటీ. మళ్లీ ఇన్నాళ్లకు కమలినీ ముఖర్జీ పేరు తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ కు వచ్చిన కమలినీ ముఖర్జీ మెడ్రన్ డ్రస్ లో కనిపించింది. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎంతో నాజుకుగా ఉండే కమిలినీ బొద్దుగా మారిపోయింది. దీంతో కమలినీ ఇలా అయిపోయిందేంటి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఆమె లుక్ చూసిన అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. దీంతో ఆమె ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్ల తర్వాత కనిపించిన కమలినీ ముఖర్జీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. మరి ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…