టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అమెరికాలో చదువుతున్న వెంకటేష్, తన తండ్రి డి. రామానాయుడు కోరిక ప్రకారం ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు. అయితే రాజా అనే టైటిల్ తో వచ్చిన సినిమాలు దాదాపు మూడు, నాలుగు సినిమాలు ఉండగా, వెంకటేష్ సినీ కెరీర్ లో ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయో ఇప్పుడు చూద్దాం. 1986 లో సురేష్ ప్రొడక్షన్స్ లో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కలియుగ పాండవులు మూవీలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్నుండి వెంకటేష్ నటుడుగా అభిమానం పెంచుకున్నారు.
1990 లో బి. గోపాల్ డైరెక్షన్ లో బొబ్బిలి రాజా సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేశారు. అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వెంకటేష్ కెరీర్ ను పీక్స్ కు చేర్చింది. నెక్ట్స్ 1993 లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ కొండపల్లి రాజా మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, సుమన్ లు పోటీ పడి మరీ నటించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది.
ఆ తర్వాత 1995 లో ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన పోకిరి రాజా రిలీజ్ అయ్యింది. ఇందులో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఆ తర్వాత 1999లో సూపర్ గుడ్ ఫిలింస్, ముప్పలనేనిశివ డైరెక్షన్ లో వచ్చిన రాజా సినిమా విడుదలైంది. వెంకటేష్ సౌందర్య హీరోయిన్ లుగా నటించారు. ఓ తమిళ సినిమాకు రీమేక్ గా రాజా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది. అలా ‘రాజా’ అనే టైటిల్ తో వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క పోకిరి రాజా చిత్రం మాత్రమే వెంకటేష్ ను నిరాశ పరిచింది. మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…