Vittalacharya : విఠ‌లాచార్య వ‌చ్చి అడిగిన కూడా ఎన్టీఆర్ నో చెప్పారా.. ఎందుక‌లా..?

Vittalacharya : విఠ‌లాచార్య.. ఈ ద‌ర్శ‌కుడి గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉడిపి విఠలాచార్య. టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసిన ఆయ‌న మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని పంచారు. ఈ సినీ మాయ మాంత్రికుడి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు ఆణిముత్యాలు.

ఉడిపిలో పుట్టిన విఠ‌లాచార్య సినిమాలో క‌ళ కంటే వ్యాపార‌మే ఎక్కువ ఉంద‌ని న‌మ్మి ముందు వ్యాపారంలోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత సినిమా పిచ్చి కూడా తోడైంది. 55 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి జాన‌ప‌ద బ్ర‌హ్మ‌గా పేరు సంపాదిచుకున్న ఆయ‌న ఒక బ‌డ్జెట్ మ‌నిషి కాబ‌ట్టి హీరో తేదీలు త‌క్కువ తీసుకుని సినిమాను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తుంటాడు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి కాల్షీట్స్ ఆయ‌న‌కు అవ‌స‌రం లేదు. వారం ప‌ది రోజులు ఇచ్చిన సినిమాని పూర్తి చేసే స్టైల్ విఠలాచార్య‌ది. ఒక‌సారి నంద‌మూరి తార‌క రామారావుతో ఒక సినిమా తీయాల‌ని అడ‌గ్గా కేవ‌లం వారం మాత్ర‌మే డేట్స్ ఉన్నాయ‌ని చెప్పాడ‌ట‌.

Vittalacharya asked NTR but he rejected movies
Vittalacharya

అయితే ఆ వారం రోజులు నాకివ్వండి చాలు.. అని విఠ‌లా చార్య అంటే దాంతో ఎన్టీఆర్ భ‌య‌పడ్డార‌ట‌. వారం రోజుల్లో సినిమాలు ఎలా పూర్తి అవుతుంది. కొంత షూటింగ్ చేశాక హీరోకి శాపం పెట్టేసి సినిమాలో క‌నిపించ‌క ముందే పూర్తి చేస్తాడేమోన‌ని భ‌యం వేసి ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట‌. అలా ఎన్టీఆర్ విఠచార్యతో సినిమాలు చేయ‌కుండా అయిపోయింది. ఏ సినిమా అయినా ప్రణాళికాబద్దంగా తీసేవాడు. ఎక్కడా పైసా కూడా వృథా ఖర్చు చేసేవాడు కాదాయన. సినిమా మూహుర్తపు షాట్‌ రోజే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసే ధైర్యం బహుశా ఆయనకొక్కడికే వుందేమో. స్క్రిప్టు వర్క్‌ పూర్తికాగానే ఆర్టిస్టులందరికీ వారి వారి పోర్షన్‌ తాలూకు పేపర్లను పంపించేస్తారు. ఆర్టిస్టులంతా సంభాషణలు కంఠస్తం చేయాల్సిందే. అలా ఉంటుంది విఠ‌లాచార్య సినిమా స్టైల్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago