Mega And Allu Family : గత కొద్ది రోజులుగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ వల్లనే ఈ వివాదం నడుస్తున్నట్టు అర్థమవుతుంది. అల్లు అర్జున్ తాను మెగా హీరో కాదని, తాను అల్లు హీరో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి, మెగా ఇమేజ్ నుంచి ఆయన దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అభిమానులు కోరగా, చెప్పను బ్రదర్ అని స్టేజ్ పై నుంచే కామెంట్ చేశారు బన్నీ. ఇటీవల అల్లు రామలింగయ్య ఫోటో షేర్ చేస్తూ ఫౌండేషన్ అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఇలాంటవన్నింటినీ చూస్తే తాను అల్లు వృక్షం కింది మొక్క అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుందని అన్నారు. అల్లు అరవింద్ ఇటీవల ఆ వార్తలన్నింటినీ ఖండించాడు. ఇక అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కోకాపేట ఆవరణలో అల్లు స్టూడియోస్ నిర్మించగా, ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్ కూడా తన మాటలతో మెగా అభిమానులను నిట్ట నిలువుగా చీల్చేశాడు. తనను ఇంతగా ఆదరించిన మెగా అభిమానులకు.. నా ఆర్మీకి, ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలిపాడు బన్నీ.
దీనిని బట్టి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ వేరని కొందరు ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈవెంట్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా కలిసి కనిపించడంతో ఎలాంటి విబేధాలు లేవని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం లోలోపల ఉన్నాయని చెబుతున్నారు. బయట పడవద్దనే ఉద్దేశంతో కెమెరా ముందు కాస్త నటించారని చెప్పుకొచ్చారు. బన్నీ ప్రస్తుతం విజయాల్లో ఉన్నాడు. దానికి తోడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి తన సొంతంగా ఎదిగాను అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ కొందరు జోస్యాలు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…