Vikramarkudu Child Artist : రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2006 జూన్ 23న విడుదలైంది విక్రమార్కుడు. సింహాద్రి, సై, ఛత్రపతి లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతున్న సమయంలో దర్శక ధీరుడు తన తర్వాతి సినిమా కోసం రవితేజను తీసుకున్నాడు. అలా విక్రమార్కుడు కాంబినేషన్‌కు బీజం పడింది. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు రూ.20 కోట్ల మార్కెట్ లేని రవితేజకు ఈ సినిమాతో అది వచ్చేసింది. స్టార్ నుంచి సూపర్ హీరోగా మారిపోయాడు మాస్ రాజా. సెకండాఫ్‌లో వచ్చే విక్రమ్ సింగ్ రాథోడ్ కారెక్టర్ అయితే అదిరిపోతుంది. విక్రమ్ కారెక్టర్ చనిపోయిన తర్వాత వచ్చే అత్తిలి సత్తిబాబు పాత్ర కూడా పిచ్చెక్కిస్తుంది. జింతాక్ తాక్ అంటూ కామెడీతో నవ్వించి చంపేశాడు సత్తిబాబు.
ఇక ఇందులో మరో ఇంపార్టెంట్ పాత్ర పోషించింది ఓ చిన్నారి. చిన్న తనంలోనే తల్లిని కోల్పోవడంతో ఎప్పుడూ తన తల్లి పాడిన జోల పాటను వినుకుంటూ ఉంటుంది. ఆ చిన్నారి ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరినీ చాలా ఎమోషనల్ అయ్యేలా చేశాయి. కాగా ఆ చిన్నారి పేరు నేహా తోట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్ష సినిమాలో నటించి అందర్నీ ఆకట్టుకున్న ఈ చిన్నారి రాముడు, అనసూయ లాంటి సినిమాలలో కూడా నటించి అలరించింది. స్టడీస్ కోసం తర్వాత సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది. అయితే ప్రస్తుతం ఎంబీఏ పూర్తి చేసిన నేహ తళుక్కున మెరిసింది.
ఈ పిక్ లో నేహా గుర్తు పట్టరానట్టుగా ఉంది. చాలా అందంగా, హీరోయిన్ మాదిరిగా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది. చూస్తుంటే రానున్న రోజులలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారినా ఆశ్చర్యపోనకర్లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే విక్రమార్కుడు సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమా కోసం ఓ క్వారీలో షూట్ చేస్తున్నపుడు అక్కడ పనిచేసే కొంతమంది కూలీలు తమకు ఈ రోజు పని లేకుండా చేశారంటూ యూనిట్ సభ్యులపైకి రాళ్ళు విసిరారు. అప్పట్లో అది సంచలనం రేపింది. ఈ దాడిలో కొందరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు కూడా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…