సోషల్ మీడియాలో సెలబ్రిటీల పాత ఫొటోలు నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. ఇవి చూసి అభిమానులు ఎంత సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల హీరోయిన్స్ చిన్నప్పటి ఫొటోస్ నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, ఇందులో క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ ఉండే హీరోయిన్స్ ని చూసి అవాక్కవుతున్నారు అభిమానులు. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ ఫొటోలో ఆ ఇద్దరు హీరోలు కాలేజ్‌లో చదువుతున్నప్పటిదిగా తెలుస్తోంది.
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు హీరోలని గమనిస్తే వారు స్టార్ హీరోలు అనే విషయాన్ని ఇట్టే గుర్తు పట్టొచ్చు. ఆ ఫొటోలో ఉన్న హీరోలు మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరోలు సూర్య, విశాల్‌లు. ఏదో ఫంక్షన్‌లో తమ మిత్రులతో కలిసి కూర్చుని ఉండగా, కుర్చీలో స్టైల్‌గా కూర్చుని ఫొటోకు ఫోజిచ్చారు. పక్కనున్న వారిలో కొంతమంది కెమెరా వైపు చూస్తుంటే మరికొందరు పక్కకు చూస్తూ ఉన్నారు. కాగా, సూర్య ప్రముఖ తమిళ సీనియర్ హీరో శివకుమార్ కుమారుడన్న సంగతి తెలిసిందే.
‘‘నేరుక్కు నేర్’’ అనే సినిమాతో సూర్య సినీ రంగ ప్రవేశం చేయగా, బాల దర్శకత్వం వహించిన నంద సినిమాతో సూర్య ఇమేజ్ పెరిగింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘‘ కాక కాక ’’ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. గజినీ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక, విశాల్ విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత జీకే రెడ్డి కుమారుడు. . అసిస్టెంట్ డైరెక్టర్‌గా విశాల్ సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. హీరో అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశారు. చెల్లమే సినిమాతో హీరో అయ్యారు. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గర అయ్యారు. త్వరలో విశాల్ పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…