మ‌రో రెండు రోజుల్లో మంచు మ‌నోజ్ అస‌లు విష‌యం చెప్ప‌నున్నాడు.. అంద‌రు వెయిటింగ్..!

ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తూ వ‌స్తున్న మంచు మనోజ్ కాస్త బ్రేక్ ఇచ్చాడు.అయితే ఇటీవ‌ల త‌న రెండో పెళ్లి విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. నంద్యాల పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికతో కలిసి ఇటీవ‌ల తరచుగా కనిపిస్తున్నారు మ‌నోజ్. గత ఏడాది వినాయక చవితి పండుగ దినాల్లో మౌనిక-మనోజ్ కలిసి ప్రత్యేక పూజలు చేయ‌డంతో పాటు వినాయక మండపాన్ని సందర్శించారు. ఆ ఫోటోలు వైరల్ కావ‌డంతో వీరిద్ద‌రు పెళ్లి చేసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. భూమా నాగిరెడ్డి జయంతి పురస్కరించుకొని మనోజ్ ఓ ట్వీట్ వేశారు. వరుస పరిణామాల నేపథ్యంలో మౌనిక-మనోజ్ ల వివాహం ఖాయమే అన్న వాదన మొదలైంది.

తాజాగా మంచు మ‌నోజ్ మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వార్తను అందరితో పంచుకుంటానని అంటున్నాడు. తన మొదటి చిత్రం ‘దొంగ దొంగది’లోని ‘మన్మథ రాజా’ పాటకు సంబంధించిన జిఫ్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నా హృదయానికి హత్తుకునే ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకున్నా. జీవితంలోని మరో దశలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటిలానే మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో రాసుకురాగా, ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది.

manchu manoj tweet viral he will reveal a matter

మంచు మనోజ్ 2004లో ‘దొంగ దొంగది’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్ట‌గా, ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్’, ‘నేను మీకు తెలుసా’ వంటి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. 2018లో ‘అపరేషన్ 2019’ మూవీ తర్వాత మళ్లీ మనోజ్ సినిమాలకు సైన్ చేయలేదు. 2015లో తన గర్ల్‌ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇక త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంని, భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్‌ ఏడడుగులు వేయడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago