మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. సినిమాలు చేయకపోవడంతో పాటు పర్సనల్ లైఫ్ లోను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్ భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు 20వ తేదీన మనోజ్ ప్రకటించబోతున్నారని అందరూ భావిస్తున్నారు. ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మనోజ్ చేసిన ట్వీట్ వైరలైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహమవుతుంది. అయితే మనోజ్.. భూమా మౌనికని పెళ్లి చేసుకోబోతున్నాడని అభిమానులు భావిస్తున్ననేపథ్యంలో ఆమె గురించి వాకబు చేస్తున్నారు. భూమా మౌనిక దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు కాగా, భూమా మౌనిక గతంలోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితో మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయారు. భూమా మౌనికకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక హైదరాబాద్ లోనే ఉంటుంది.
అక్క అఖిలప్రియతో ఆస్తి వివాదాలు ఉండగా ఆ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని భూమా మౌనిక భావిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా మౌనికకు ప్రజల్లో మంచి పేరు ఉండటం గమనార్హం. మౌనికా రెడ్డి మంచి మాటకారి కావడంతో పాటు మృదు స్వభావి కూడా. ఆమె చాలా మందికి సాయం చేసిందని త్వరలో ఆళ్లగడ్డ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మనోజ్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ విషయంలో మనోజ్‌తో ఆయన కుటుంబ సభ్యులు గొడవ పడ్డారని, మాట్లాడడం లేదని కూడా ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…