Virupaksha Movie : ఈ మధ్య కాలంలో బలమైన కంటెంట్ ఉంటే మాత్రమే ఆడియన్స్ ఆదరిస్తున్నారు.. లేదంటే స్టార్స్ ఉన్నప్పటికీ, థియేటర్ల దగ్గర జనాలు పల్చగానే కనిపిస్తున్నారు. మొదటి మూడు థియేటర్స్ లో సినిమా నిలబడితే చాలు అనుకునే పరిస్థితి. చాలా సినిమాలు వీకెండ్ తరువాత థియేటర్స్ లో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘విరూపాక్ష’ థియేటర్లోకి రాగా, మంచి విజయం సాధించింది. సాయితేజ్ – సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 21వ తేదీన విడుదలైంది. కార్తీక్ దండుకి దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇక వరుస ఫ్లాపుల తరువాత సాయితేజ్ చేసిన సినిమా పెద్ద హిట్ కొట్టింది. లాభాల వర్షం కురిపిస్తుంది.
ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘విరూపాక్ష’.. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచి అందరిని ఆశ్చర్యపరచింది. లాభాల పరంగా కూడా ఆయన కెరీర్‌లోనే బెస్ట్ రికార్డును సెట్ చేస్తోంది ‘విరూపాక్ష’. ‘విరూపాక్ష’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.22 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. అంటే, రూ.20 కోట్ల మేర లాభం వచ్చినట్టే. అయితే, ‘విరూపాక్ష’ బిజినెస్ ఇంకా ముగిసిపోలేదు.
తొలిరోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 13 రోజుల్లో 82.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … ఫొటోగ్రఫీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. హిందీ, తమిళం, మలయాళంలో కూడా ‘విరూపాక్ష’ విడుదల అవుతోంది. అక్కడ కూడా మంచి టాక్ వస్తే సినిమాకు కలెక్షన్స్ అదిరిపోతాయి. ఇవన్నీ కలిపితే గ్రాస్ రూ.100 కోట్లు దాటేయడం ఖాయం. అలా అయితే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ ఒక మైలురాయిలా నిలిచిపోతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…