Jr NTR Net Worth : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్కో సినిమాకు రు. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉండేది. అయితే ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల మనిషి.. నిర్మాతల శ్రేయస్సు కోసం ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేందుకు పెద్దగా ఇష్టపడేవాడు కాదు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు. 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునేవాడు జూనియర్.
టెంపర్ తర్వాత మనోడికి వరుసగా ఐదు సూపర్ డూపర్ హిట్లు పడడంతో పాటు.. త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కాస్త పెరిగింది. త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు పాటు పనిచేశాడు. దీంతో రాజమౌళి నిర్మాత దానయ్యకు చెప్పి ఎన్టీఆర్‌కు రు. 45 కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పించాడనే టాక్ నడుస్తుంది.. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమా కోసం.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. నివేదికల ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ. 450 కోట్లు అని తెలుస్తుంది.
ఆయన ఆస్తుల విలువ చూస్తే.. తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉందని అంటున్నారు. కోట్లకు వారసుడు అయినా తారక్ సింపుల్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఆయనకు వాచేస్, కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు తారక్ వద్ద ఖరీదైన వాచీలు, కార్లు చాలానే ఉన్నాయి. అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్ ఉంది. దాని ధర రూ. 4 కోట్లు. రూ. 2.5 కోట్లు. విలువ పలికే వాచ్ కూడా ఉంది. గతంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాలపై మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రం తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని తెలియజేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…