Virat Kohli : వారి వ‌ల్ల‌నే సెంచ‌రీ సాధ్య‌మైందంటూ విరాట్ కామెంట్స్

Virat Kohli : వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత వరల్డ్ కప్‌లో కోహ్లీ సెంచరీ చేశాడని మురిసిపోతున్నారు. కానీ ఇలా కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా హెల్ప్ చేశాడని కొందరు మర్చిపోతున్నారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ మాత్రం కెటిల్‌బరోపై కూడా జోకులు వేస్తున్నారు. కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. వచ్చీరావడంతోనే అతను కోహ్లీ లెగ్‌సైడ్ బంతిని వేశాడు. కోహ్లీ కొంచెం అలా పక్కకు తప్పుకోగానే అది అతని కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లో పడింది.ఇలా కావాలని నాసుమ్ వైడ్ డెలివరీ వేయడం చూసిన కోహ్లీ చికాకు ప‌డ్డాడు.

అయితే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం దాన్ని వైడ్‌గా ప్రకటించలేదు. కోహ్లీ కూడా ఈ నిర్ణయం చూసి షాకయ్యాడు. గడ్డం గీక్కుంటూ ఆలోచిస్తున్నట్లు కెటిల్‌బరో కనిపించాడు. ఆ తర్వాత మూడో బంతికే భారీ సిక్సర్ బాదిన కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కెటిల్‌బరో ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న ఫ్యాన్స్.. ‘అసలు కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్ అతనికి మెడల్ ఇవ్వాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి కేఎల్ రాహుల్ వారధిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే అవకాశం ఉన్నాగానీ సెంచరీ వద్దనుకున్నాడు విరాట్. కానీ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో.. చివరకు శతకాన్ని అందుకున్నాడు రన్ మెషిన్. ఈ విషయాన్ని స్వయంగా మ్యాచ్ అనంతరం వెల్లడించాడు రాహుల్.

Virat Kohli talked about his century
Virat Kohli

రాహుల్ మాట్లాడుతూ..”కోహ్లీ సింగిల్ తీద్దాం అంటే నేనే వద్దని చెప్పా. కానీ సింగిల్స్ తీయకపోతే.. జనాలు, ఫ్యాన్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని అనుకుంటారని కోహ్లీ చెప్పాడు. అయితే మనం ఎలాగో గెలుస్తాం.. అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు, నువ్వు సెంచరీ పూర్తి చెయ్” అని చెప్పానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ రాహుల్ చేసిన మరో గొప్ప పని ఏంటంటే? విరాట్ 74 పరుగులతో ఉన్నప్పుడు.. విజయానికి 26 పరుగులు అవసరం. అయితే ఆ తర్వాత నుంచి కేఎల్ రాహుల్ ఒకే ఒక్క బంతి మాత్రమే ఆడాడు. విరాట్ సింగిల్స్ కోసం ప్రయత్నించినా.. రాహుల్ వెళ్లలేదు. దీంతో 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 97 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. విజయానికి కేవలం 2 రన్స్ మాత్రమే కావాలి. అప్పుడు సిక్స్ కొట్టి ముగించాడు. అయితే జ‌డేజాకి రావ‌ల్సిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ త‌న‌కు ద‌క్కిందంటూ కోహ్లీ ఫ‌న్ చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago