Vijaya Shanti : విజయశాంతి..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఈ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి మరోసారి అలనాటి విజయశాంతిని గుర్తుచేశారు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించలేదు. మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది విజయశాంతి. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో కళ్యాణ్ రామ్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
ఈ మూవీకి ‘రాజా చెయ్యి వేస్తే’ ఫేమ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే విజయశాంతిని చూడగానే కళ్యాణ్ రామ్, మురళీ మోహన్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అందరిని ఆశ్చర్యపరచింది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషించనుంది. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రారంభోత్సవ వేడుకలో కళ్యాణ్ రామ్ తో పాటుగా విజయ శాంతి, సయీ మంజ్రేకర్ సందడి చేసారు. మహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…