Good Night Movie : మనిషికి ఉండే ఏదో ఒక సమస్యతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా.. గురక సమస్యతో వచ్చిన చిత్రం గుడ్ నైట్ కాగా, డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది.మణికందన్, మీతా రఘునాథ్, రమేశ్ తిలక్, రేచల్ రెబకా, బాలాజీ శక్తివేల్.. తదితరులు నటించిన ఈ చిత్రంకి సంగీతం సీన్ రోల్డన్ అందించగా, వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మోహన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. మధ్య తరగతి కుటుంబ అతడిది. అయితే అతడికో సమస్య ఉంది. నిద్రపోయాడంటే.. గురక పెడితే పక్కింటివాళ్లు కూడా భయపడిపోవాలి. ఆఫీసులో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు.
అయితే ఓ రోజు కలిసి బస్సులో వెళ్తుంటారు. చల్లని గాలి వస్తుంటే.. ఓ అరంగంట నిద్రపోతాడు. కానీ గురక మాత్రం దారుణంగా పెడతాడు. బస్సులో నువ్ పెట్టే గురకనే తట్టుకోలేక పోతున్నాను, ఇక జీవితాంతం అంటే నా వాళ్ల కాదని అమ్మాయి వదిలేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ మోటారు మోహన్ అని ఎగతాళి చేస్తుంటారు. ఇక ఓ రోజు తన బావతో కలిసి పని మీద ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ అను(మీతా రఘునాథ్)ను చూడగా, ఆమెతో పరిచయం అవుతుంది. అది ప్రేమ వరకూ దారి తీస్తుంది. మెుత్తానికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మెుదటి రాత్రి రోజునే.. అనుకు మోహన్ గురకం విషయం అర్థమవుతుంది. మోహన్ పెట్టే గురకకు అనుకు నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడవుతుంది. గురక సమస్యతో హీరోకు వచ్చిన కష్టాలేంటి? అని తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
ప్రతి మనిషికి ఏదో ఒక లోపం, సమస్య ఉండటం సహజమే. కానీ, వాటి తీవ్రతను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. మనకున్న లోపాలను, పర్సనల్ సమస్యలను యాక్సెప్ట్ చేసి ముందుకు సాగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమని చెప్పే సినిమానే గుడ్ నైట్. మూవీలో మోహన్ కు గురక సమస్య ఉండటం, దాని వల్ల అతనికి జరిగే అవమానాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి గురక ఉందని తెలిసిన అమ్మాయి అను ఎలా రిసీవ్ చేసుకుంది అనే అంశాలతో కామెడీగా, ఎమోషనల్ గా చూపించారు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖర్. ఎప్పుడు కంగారు పడే మోహన్ కు ఉన్న గురక ద్వారా కామెడీ జెనరేట్ చేశారు. ఇక ఇంట్రావర్ట్, అమాయకపు అకౌంటెంట్ గా అను క్యారెక్టర్ బాగుంది. వీరి ఇద్దరి పరిచయంతో మూవీ ఇంకాస్తా ఇంట్రెస్ట్ గా సాగుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…