Virat Kohli : ప్రస్తుతం భారత్ , పాకిస్తాన్ మధ్య పరిస్థితులు సానుకూలంగా లేవు. క్రికెట్ పరంగా చూస్తే ఈ రెండు జట్లు కేవలం ప్రపంచ కప్ టోర్నీతో పాటు ఆసియా కప్ సిరీస్‌లోనే ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడి అద్భుత విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగనుండగా, అక్కడ క్రికెట్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు.. అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా ధృవీకరించారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికలో జరుగుతుందని ప్రకటించారు.
మరి ఇలాంటి పరిస్థితులలలో కోహ్లీ పాకిస్తాన్‌లో ప్రత్యక్షం కావడమేంటని ఆశ్చర్యపోతున్నారా..పెద్దగా టెన్షన్ తీసుకోకండి. కోహ్లీ పాక్ వెళ్లింది ఇప్పుడు కాదు లేండి. చాల సంవత్సరాల క్రితం. అప్పటి వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పాక్ అభిమానుల మనసులు దోచుకున్న ఒకే ఒక్క ఆటగాడు ఉన్నారంటే అది భారత దిగ్గజం విరాట్ కోహ్లినే. భారత మాజీ కెప్టెన్‌కు పాకిస్థాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచుగా పాకిస్తాన్ అభిమానులు విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లతో పాకిస్తాన్ మ్యాచ్‌లలో కనిపిస్తారు. విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌లో ఆడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కాని రెండు దేశాల మధ్య రాజకీయం వలన అది కుదరడం లేదు.
అయితే విరాట్ 2006లో అండర్ -19 జట్టుతో పాకిస్థాన్‌కు వెళ్లాడు. భారత్ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడింది . అప్పుడు అన్ని గేమ్‌లు గెలిచింది. విరాట్ కోహ్లి టూర్‌కి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, విరాట్ కోహ్లీ షాపింగ్ చేస్తున్నాడు. తరువాత, అతను తన స్నేహితులతో కూర్చుని పానీయం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో చెతేశ్వర్ పుజారా, పీయూష్ చావ్లా కూడా ఉన్నారు.ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…