Virat Kohli : సెమీ ఫైన‌ల్ ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ‌.. కోహ్లికి గాయం..

Virat Kohli : సూపర్ 12 రౌండ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా రేపు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఫైట్ చేయ‌నున్న విషయం తెలిసిందే.న‌వంబర్ 10న ఆడిలైడ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా మూడు మ్యాచులు జరగగా రెండింట్లో టీమిండియా గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి విజయం వరించింది.. 2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడుతుండ‌డంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆస‌క్తి ల‌నెల‌కొంది.

సెమీస్ ఎలాగైన గెలిచి ఫైన‌ల్ కి వెళ్లాల‌ని టీమిండియా భావిస్తుంది. ఇందుకోసం ఆట‌గాళ్లు నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్పటికే ఆడిలైడ్ చేరుకున్న భారత జట్టు, మంగళవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, దానిపై భార‌త్ జ‌ట్టు క్లారిటీ ఇచ్చింది. మ‌రి రోహిత్‌కి అయిన గాయం పెద్దదేమీ కాదని, అతను సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడతాడని భారత జట్టు స్పష్టం చేసింది… తాజాగా బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడనే వార్త అభిమానులను కంగారు పెడుతోంది.

Virat Kohli injured in net session ahead of t20 world cup 2022 semi finals
Virat Kohli

నెట్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీ గాయపడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హర్షల్ పటేల్ వేగంగా వేసిన బంతి గజ్జ ప్రాంతంలో కోహ్లీని తాకింది. కోహ్లీ కొన్ని నిమిషాల పాటు మోకాళ్లపై కూర్చుని, ఆ తర్వాత మళ్లీ లేచి వార్మప్ చేయడం వీడియోలో కనిపించింది. కోహ్లీకి బంతి గట్టిగానే తగలిందని, అయితే కొద్ది నిమిషాల తర్వాత బాగానే ఉన్న‌ట్టుగా వీడియోలో క‌నిపిస్తుంది. గాయం నుంచి కోహ్లీ తేలుకున్నాడని, సెమీ ఫైనల్‌కి ముందు టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్ధ‌మ‌వుతుంది. ఇక ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు విరాట్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago