Virat Kohli : సూపర్ 12 రౌండ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా రేపు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఫైట్ చేయనున్న విషయం తెలిసిందే.నవంబర్ 10న ఆడిలైడ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా మూడు మ్యాచులు జరగగా రెండింట్లో టీమిండియా గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి విజయం వరించింది.. 2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి లనెలకొంది.
సెమీస్ ఎలాగైన గెలిచి ఫైనల్ కి వెళ్లాలని టీమిండియా భావిస్తుంది. ఇందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆడిలైడ్ చేరుకున్న భారత జట్టు, మంగళవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, దానిపై భారత్ జట్టు క్లారిటీ ఇచ్చింది. మరి రోహిత్‌కి అయిన గాయం పెద్దదేమీ కాదని, అతను సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడతాడని భారత జట్టు స్పష్టం చేసింది… తాజాగా బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడనే వార్త అభిమానులను కంగారు పెడుతోంది.
నెట్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీ గాయపడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హర్షల్ పటేల్ వేగంగా వేసిన బంతి గజ్జ ప్రాంతంలో కోహ్లీని తాకింది. కోహ్లీ కొన్ని నిమిషాల పాటు మోకాళ్లపై కూర్చుని, ఆ తర్వాత మళ్లీ లేచి వార్మప్ చేయడం వీడియోలో కనిపించింది. కోహ్లీకి బంతి గట్టిగానే తగలిందని, అయితే కొద్ది నిమిషాల తర్వాత బాగానే ఉన్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. గాయం నుంచి కోహ్లీ తేలుకున్నాడని, సెమీ ఫైనల్‌కి ముందు టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్ధమవుతుంది. ఇక ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు విరాట్.