Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన రష్మిక సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో నేషనల్ క్రష్‌గా మారింది.ఓ వైపు దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ రష్మిక క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఈ అమ్మడు నటించిన చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో తర్వాతి సినిమాలపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే కొద్ది రోజులుగా రష్మికపై తప్పుడు ప్రచారాలు బాగా జరుగుతున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని ఇన్నాళ్లు చూసి చూడనట్టు వ్యవహరించిన రష్మిక ఇప్పుడు మాత్రం గట్టిగా ఇచ్చింది.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెద్ద పోస్ట్ పెట్టిన రష్మిక.. ‘‘గత కొన్ని రోజులు, వారాలు, లేదా నెలలు లేదా సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు నా కోసం నేను మాట్లాడుతున్నాను. నిజానికి ఈ పనిని సంవత్సరాల క్రితమే చేసి ఉండాల్సింది. నేను నా కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి ఎంతో ద్వేషాన్ని ఎదుర్కొంటున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను కోరుకోవడం లేదు. అంటే దీనర్థం మీరు నన్ను ఆమోదించొద్దని, నాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని వ్యాప్తి చేయమని కాదు.
మిమ్మల్ని సంతోష పెట్టేందుకు నేను నిత్యం ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. నేను పెట్టిన శ్రమ మీకు ఎంత మేర సంతోషాన్నిస్తుందన్నదే నాకు ముఖ్యం. మీరు గర్వపడే విధంగా నేను నా వైపు నుంచి అత్యుత్తమ పనితీరును ఇవ్వడానికే కష్టపడుతున్నాను. నేను చెప్పని విషయాలపై నెట్టింట నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు అది నిజంగా నన్ను నిరుత్సాహపరుస్తోంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని విషయాలు నాకు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రతికూల కథనాలు ఇంటర్నెట్ లో వ్యాప్తి చెందుతున్నాయి. అది నాకు, పరిశ్రమలోనూ, బయట నా అనుబంధాలకు ఎంతో హాని కలిగిస్తుంది. చాలా కాలంగా భరిస్తూ వచ్చానని.. కాని ఇకనైనా స్పందింకపోతే… ఇవి ఇలానే పెరిగిపోయి..ఇంకా ఏమైనా రాసేస్తారంటూ.. తప్పక స్పందించాల్సి వస్తుందంటుంది రష్మిక మందన్నా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…