Vishal : తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోల్లో విశాల్ ఒకడు. విశాల్ హిట్, ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తనకు చేతనైనంత సాయం చేస్తూ విశాల్ మంచి ఇమేజ్‌నే సంపాదించుకున్నాడు. అయితే కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో విశాల్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు. తాజాగా ఓ చారిటబుల్ ట్రస్ట్ సాయంతో 11 మంది పేద జంటలకు వివాహం చేశాడు విశాల్.
తాళిబొట్టు సహా ఆ 11 మంది జంటలకు ఇళ్లకు అవసరమైన వస్తువులను అందించాడు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాతో ఆయన ముచ్చటించాడు. తనకు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాదని, లవ్ మ్యారేజ్‌నే చేసుకోవాలని ఉందని ఆయన అన్నాడు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా.. త్వరలోనే ఆమెను మీకు పరిచయం చేస్తానని నేను ఓ పని మీద బిజీగా ఉన్నాను. యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నాను. ఈ బిల్డింగ్ పూర్తయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తాను. మీ ఆశీర్వాదం మా ఇద్దరికీ కావాలి అంటూ చెప్పుకొచ్చాడు.
విశాల్ ఇలా చెప్పటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రీసెంట్గా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయాను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే అది ఫేక్ అంటూ మేము రియల్ పెయిర్ కాదు రీల్ పెయిర్ అంటూ అభినయ క్లారిటీ ఇచ్చింది. కాగా గతంలో తమిళ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాల్ హీరోగా నటించిన లాఠీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు మార్క్ ఆంటోని అనే సినిమాను కూడా ఆయన రీసెంట్‌గానే అనౌన్స్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…