Vijaykanth : అప్పటి తమిళ్ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చికిత్స అందుకుంటూ ఇటీవల చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దీంతో విజయ్‌కాంత్ మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. సినిమాల్లోకి వచ్చాక విజయ్‌కాంత్ గా పేరు మార్చుకున్నారు. మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరో అయ్యారు విజయ్‌కాంత్.
మొదట్లో ఎక్కువగా విప్లవ భావాలు ఉన్న సినిమాలు చేసిన విజయ్‌కాంత్ ఆ తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మారిపోయారు.1 984లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేశారు విజయ్‌కాంత్. విజయ్‌కాంత్ దాదాపు 150కి పైగా సినిమాలు చేస్తే అందులో 20కి పైగా పోలీస్ పాత్రలు చేయడం విశేషం. విజయ్‌కాంత్ 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ భారీ హిట్ అవ్వడంతో ఆయనకి కెప్టెన్ బిరుదుగా స్థిరపడిపోయింది. ఆయన తండ్రి అలగర్‌స్వామి ఒక రైస్ మిల్లు యజమాని. ఈయనకు తెలుగు మూలాలు ఉన్నాయనేది తమిళనాట ఒక వాదన. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో విజయకాంత్ తరచుగా స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్తుండేవారు. ఎంజీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేవారు.
చెన్నైకి మారేంతవరకు తమిళ సినిమాల్లో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో నటించేందుకు ఎక్కడికెళ్లినా శరీరం రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయని ఆయన వివిధ సందర్భాలలో చెప్పారు. విజయ్‌కాంత్ చేసిన పలు సినిమాలు టాలీవుడ్ లో కూడా రీమేక్ అయి విజయం సాధించాయి. మెగాస్టార్ ఠాగూర్ సినిమా కూడా విజయ్‌కాంత్ రమణ సినిమా రీమేక్. నటుడు విజయకాంత్ తన సినీ కెరీర్‌లో 54 మంది కొత్త దర్శకులను పరిచయం చేశారని నిర్మాత శివ ఒక సందర్భంలో చెప్పారు. ప్రపంచ సినిమాలో మరెవరూ ఇలా చేసి ఉండరు. ఎంతో మంది కొత్త నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు విజయకాంత్ అవకాశం ఇచ్చారు . తన సినిమాలకు అనేక అవార్డులు అందుకున్నారు. 2001లో తమిళ ప్రభుత్వం అత్యున్నత అవార్డు కలైమామణి విజయ్‌కాంత్ కు ఇచ్చి సత్కరించారు. బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు కూడా అందుకున్నారు. విజయ్‌కాంత్ మూడుసార్లు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో వేర్వేరు ప్రాంతాల నుంచి పోటీ చేయగా రెండు సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయారు.
విజయకాంత్ లాంటి మనిషిని ఎప్పుడూ చూడలేదు. ఆయన నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లను కూడా ప్రేమపూర్వకంగా చూసుకునేవారు. సంఘం అప్పులు తీర్చడం కోసం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా అందరినీ బాగా చూసుకునేవారు. ”కొరియోగ్రాఫర్లకు సింగపూర్ నుంచి మలేషియాకు టికెట్లు కూడా ఆయనే బుక్ చేయించారు. డ్యాన్సర్లే కదా బస్సులో వస్తారులే అని వదిలేయలేదు” అని కొరియోగ్రాఫర్ బృంద అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…