Vijayashanti : చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.
ఓసేయ్ రాములమ్మా తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డున్నీ బద్దలు కొట్టింది. సినిమాలకు గుడ్ బై చెప్పాక రాములమ్మ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో చాలారోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించింది లేడీ సూపర్ స్టార్. ఇక విజయశాంతి వ్యక్తిగత విషయానికి వస్తే.. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్, గణేష్‌రావుకు స్వయాన మేనల్లుడు. ఈయన హీరో బాలకృష్ణ స్నేహితులు. వీరి స్నేహంతోనే బాలయ్యతో ఓ సినిమాను నిర్మిచాలనుకున్నారు.
ఇక బాలకృష్ణతో యువరత్న ఆర్ట్స్ స్థాపించి ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ సినిమాను చిత్రీకరించారు. అందులో హీరోయిన్‌గా పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు విజయశాంతిని ఎంపిక చేశారు. ఆ చిత్రంలో నటించేందుకు ప్రసాద్ స్వయంగా విజయశాంతి వద్దకు వెళ్లారు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈయన నిర్మాతగా బాలయ్యతో కలిసి నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజీగా నిలిచింది. బాలయ్య విజయశాంతి కాంబోలో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…