Vijaya Shanti : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా తొలిసారి రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అనేక విమర్శలని మూటగట్టుకుంటుంది. విక్టరీ వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో నోటి నుండి డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్ ఆడియన్స్ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌పై విజయశాంతి నిప్పులు చెరిగింది.
తన సోషల్ మీడియా వేదికగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.. ఇన్ డైరెక్ట్‌గా ఈ వెబ్ సిరీస్‌పై పంచ్‌లు పేల్చింది. ముఖ్యంగా ఇటువంటి ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందు ముందు ప్రజా, మహిళా వ్యతిరేకత రాకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుదల చేసే కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి చేయాలన్నట్టు విజయశాంతి సూచన చేసింది. అంతేకాకుండా.. తన సహనటులకు, నిర్మాతలకు కూడా ఆమె ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టింది.. ఈ విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.
ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోకుంగా సంబంధిత నటులు, మరియు నిర్మాతలు ఓటీటీ నుండి నిరసించబడుతున్న ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ఓటీటీ ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తున్నాను.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను అని విజయశాంతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇక రీసెంట్‌గా సీనియర్ నటుడు శివకృష్ణ ఓటీటీ కంటెంట్‌పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు.ఓటీటీలు మన సంస్కృతి, సాంప్రదాయాలు ఖూనీ చేయబడుతున్నాయి. అలా అయితే దేశం నాశనం అవుతుందని శివ కృష్ణ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…