Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ రోజు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియజేశారు. పేదరికం అనుభవించిన మోహన్ బాబు మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన విద్యను అభ్యసించి ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు అండదండలతో నటుడిగా కెరియర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు గతం నెమరు వేసుకుంటే తెలియని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్గా కనిపిస్తానో అంతకంటే చాలా సున్నితమైన వాడిని.. ఏది తట్టుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని… ఇళ్లు కూడా అమ్ముకున్నానని అన్నారు. పగవాడికి కూడా తనలాంటి కష్టాలు రాకూడదని.. సినీ కెరీయర్ లో ఎదురైన ఇబ్బందుల కారణంగా తన ఇల్లు కూడా అమ్ముకున్నానని చెప్పారు. అయితే తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదని… ఇక తన సొంత బ్యానర్ పై నిర్మించిన సన్నాఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు ఫెయిల్యూర్ గా నిలిచాయని పేర్కొన్నారు.
1970లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన అసలు పేరు భక్తవత్సలం కాగా.. సినిమాల్లోకి వచ్చాక మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. స్వర్గం నరకం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు మోహన్ బాబు. హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. హాస్యనటుడిగా.. నిర్మాతగా.. విద్యావేత్తగా.. రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగారు మోహన్ బాబు. ఆయన తన కెరీయర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…