Alekhya Reddy : నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్నటితో ఆయన మరణించి నెల పూర్తైంది.ఈ క్రమంలో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియాలో స్టన్నింగ్ పోస్ట్ పెట్టింది. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు నా మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. ఇది మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. మీతో నా పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారింది. మన ప్రయాణంలో పెళ్లి నిర్ణయం నుంచే మీరు ఎంతో పోరాడారు. అయితే ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాం.
అయితే మన వివాహం ఎంతో గందరగోళం సృష్టించింది. మనపై ఎంతో వివక్ష ఉన్నప్పటికీ నువ్వు నాతోనే ఉన్నావు. ఆరోజు నుంచి ఇప్పటివరకు మీతో నేను సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టిన తర్వాత మన జీవితం చాలా మారిపోయింది. మన సంతోషం రెట్టింపు అయ్యింది.. అయితే బాధలు మాత్రం అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్నితప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలుల కనేవాడివి. అయితే 2019లో మనకు కవలలు జన్మించారు. దీంతో నీ కల నిజమైందని ఎంత సంతోషించావో ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇన్నేళ్లూ ఎంతో పోరాటం చేశారు. చివరి వరకు మీరు పోరాడుతూనే ఉన్నారు.
మనకు కావాల్సినవాళ్లే మన మనసుకు పదే పదే గాయం చేస్తే అది భరించడం కష్టం. అయితే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరకు సపోర్ట్ గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోవడం జరిగింది. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం. నువ్వు ఎప్పటికీ రియల్ హీరో. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం ఓబు. మిమ్మల్ని మళ్లీ కలవాలని.. మీతో మరోసారి ప్రయాణించాలని ఆశిస్తున్నానుఅంటూ తారకరత్నతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. అంతకుముందు బాలకృష్ణను ఉద్దేశిస్తూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ కామెంట్ చేసింది. మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ అంటూ తారకరత్న ఆసుపత్రిలో ఉండగా బాలయ్య బాబు చేసిన సేవల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…