Vijay Deverakonda : సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ హెచ్ఐసీసీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు చిత్రయూనిట్. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
అయితే ఈ ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. చాలా ఈవెంట్స్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ డ్యాన్సులు వేశారు. కానీ ఖుషి ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడంతో అందరు బిత్తరపోయి చూశారు. ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని, ఇది మ్యూజికల్ కాన్సర్టా లేక ప్రీ వెడ్డింగ్ షూటా అని, వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత అభిమానులు కూడా సమంత ఇలా చేస్తుంది అనుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
సమంత, విజయ్ దేవరకొండ డ్యాన్స్ ని చూసి విజయ్ తల్లి కూడా షాకైంది. ఇక వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సడెన్ గా సమంతకి హెల్త్ బాగోలేదు అని మూడు రోజులు గ్యాప్ తీసుకుంది, హాస్పిటల్స్ కి తిరిగింది. బయటకి బాగానే కనిపిస్తుండటంతో నీకు ఏం కాలేదు షూట్ కి వచ్ఛేయ్ అని నేను, శివ అన్నాం. కానీ మూడు రోజుల గ్యాప్ రెండు వారాలు అయింది. ఆ తర్వాత నెలలు అయింది. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి చెప్పింది. కొన్ని నెలలు సమంత మాతో మాట్లాడలేదు, మమ్మల్ని కలవలేదు. దాదాపు 60 శాతం షూట్ అయ్యాక సినిమా షూట్ ఆగిపోయింది. తన హెల్త్ గురించి బయటకి అందరికి చెప్తా అన్నప్పుడు వద్దు అన్నాను. కానీ ఇంత హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా మనం కష్టపడుతున్నాం, అది అందరికి తెలియాలి. సమంత ఫేస్ లో స్మైల్ చూడాలి అని అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…