Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతో అనేక మంది మనసులు చూరగొన్నాడు. ఆయనపై విమర్శలు చేసేవారికి విజయ్ దేవరకొండ గట్టిగానే బదులిస్తున్నాడు. అనసూయ గత కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండపై పలు విమర్శలు చేయగా, ఆయనపై చేసిన కామెంట్స్ కి ఈ రోజు విజయ్ అభిమానులు గట్టిగా సమాధానమిస్తున్నారు. విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు నువ్వు ఏ నాడైన చేశావా అంటూ ఆమెకి గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో స్టార్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.
కెరీర్ ప్రారంభంలోనే సామాజిక సేవను ప్రారంభించారు. తాను సంపాదించే దానిలో కొంత మొత్తం సోషల్ సర్వీసుకు వాడుతున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారు. వారికి నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే, నాకు కష్టమొచ్చిందని ఎవరైనా వెళ్తే తనకు తోచిన సాయం చేస్తున్నారు. అయితే, ఇటీవల ‘ఖుషి’ ప్రచారంలో భాగంగా వైజాగ్ వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడ ఒక ప్రకటన చేశారు. ‘ఖుషి’ సినిమా ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్‌లో కోటి రూపాయలను 100 కుటుంబాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
తాజాగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చెక్‌ను స్వయంగా అందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ‘స్ప్రెడింగ్ ఖుషి’ అనే ఈవెంట్‌ను నిర్వహించి చెక్‌లు అందజేశారు. ఈ విధంగా 100 కుటుంబాలకు సాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదే విధంగా ప్రతి ఏడాది, తాను సినిమాలు చేసినంత కాలం ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే మనకు హెల్ప్ అయ్యేది కదా అని అప్పుడు నేను అనుకునేవాడిని. ఎలాగోలా అవన్నీ దాటుకుని ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. మీకు ఒక ఫ్యామిలీలా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ సాయం చేయగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…