Vijay Antony : కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని పెద్ద కూతురు పేరు మీరా. అమె ప్లస్ 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. పన్నెండో తరగతి చదువుతున్న మీరా ఇలా అత్మహత్య చేసుకుందంటే.. ఒత్తిడే కారణమై ఉంటుందని అంతా అనుకుంటున్నారు. విజయ్ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.
జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాన్న వెళ్లిపోయాక మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే ఆత్మహత్యల గురించి విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే పలు సంక్షోభాల లోతు నాకు తెలుసు.. అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
మీరా అంత్యక్రియల సమయంలో విజయ్ చాలా కుమిలిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయోద్దంటూ తెలియజేశాడు. విజయ్ ఆంటోని ఆవేదన చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. కూతురి మరణం పట్ల కుంగిపోయిన విజయ్ ఆంటోనికి అభిమానులు ధైర్యాన్ని చెబుతున్నారు. బాధపడకు అన్నా.. ధైర్యంగా ఉండు అంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ నెట్టింట్లో ట్వీట్లు పెడుతున్నారు. కాగా,బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…