బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరో విజయ్ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తూ వస్తున్న విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2 చేస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైనట్లు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇటీవల మలేషియాలో జరిగింది. ఈ తరుణంలో ప్రమాదం జరగడంతో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో పళ్లు, దవడ ఎముక విరిగినట్లు వార్తలు వచ్చాయి.. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోమాలో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో రూమర్స్‌పై తాజాగా విజయ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. విజయ్ తాజాగా చేసిన ట్వీట్లో.. ‘డియర్ ఫ్రెండ్స్, మలేషియాలో పిచైక్కారన్ 2 (బిచ్చగాడు 2) షూటింగ్ సమయంలో నా దవడకి,ముక్కుకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ పూర్తి అయ్యింది.
వీలైనంత త్వరలో మీ అందరితో మాట్లాడతాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని విజయ్ ఆంటోని రాసుకొచ్చాడు.ఓ ఫోటోని కూడా పోస్ట్ చేయగా, సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి తీసిన పిక్‌లా ఉంది. అభిమానులు తన ఆరోగ్య పరిస్థితి పట్ల ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని ఇలా స్పందించారు. విజయ్ కోలుకున్నాడని తెలిసి అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన తెర మీద మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆంటోని ఆ తర్వాత హీరోగా, దర్శుకుడిగా తనలోని సత్తా చూపిస్తూ అందరి మనన్ననలు పొందుతున్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…