బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై నోరు మెద‌ప‌ని నాగార్జున‌.. ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఇదేనంటున్న నెటిజ‌న్స్..

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అక్కినేని..ఎస్వీఆర్ అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలగాజనం అంటూ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన బాల‌య్య ఇప్పుడు అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేశారు. ఆ ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారు. బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేక.. ఉద్దేశపూరకంగా చెప్పారో గానీ.. అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అక్కినేని.. తొక్కినేని అంటూ, . తొలితరం దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరును కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్, వేదాలు శాస్త్రాలు నాన్నగారు, ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని.. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లమని అన్నారు. అయితే అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి నాడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కామెంట్లపై అక్కినేని అభిమానులు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా నిన్న ట్వీట్లు చేశారు. కానీ అక్కినేని నాగార్జున ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

nagarjuna till now not responded on balakrishna comments

అక్కినేని గురించి నోరు జారిన బాలయ్య సంస్కారాన్ని ఆయన విజ్ఞతకే వదిలేసేలా నాగ్ మౌనం పాటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. మ‌రోవైపు బాలయ్యకి, నాగార్జునకి తేడా ఇది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. బంగార్రాజు సక్సెస్ ఈవెంట్ లో నాగార్జున .. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్.. నేడు ఎన్టీఆర్ గారి వర్ధంతి.. చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన్ని గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ లివ్స్ ఆన్.. ఏఎన్నార్ లిప్స్ ఆన్.. అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ని నాగార్జున అంత గౌర‌వించ‌గా, ఇప్పుడు బాల‌య్య అలా మాట్లాడ‌డం స‌రికాద‌ని కొంద‌రు పెద్ద‌లు అంటున్నారు. బాలకృష్ణ-నాగార్జున మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో తను స్పందిస్తే, వివాదం మరింత ముదురుతుందనే భావనతో నాగార్జున వెనక్కితగ్గిన‌ట్టు టాక్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago