Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ సెలబ్రిటీల గురించి ఆయన ఇప్పటికే చాలా ఆసక్తికరమైన జోస్యాలు చెప్పగా కొన్ని నిజం అయ్యాయి, మరి కొన్ని వివాదాస్పదం అయ్యాయి. గతంలో సమంత మరియు నాగచైతన్య పెళ్లి సమయంలోనే వారి వివాహం కలిసి రాదని వారు త్వరలోనే విడిపోతారు అంటూ జోస్యం చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టుగానే గతేడాది నాగచైతన్య మరియు సమంత వేణు స్వామి చెప్పినట్టు విడాకులు తీసుకున్నారు. ఇక ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
నయనతార కి పెళ్లి అచ్చి రాదని వివాహం తర్వాత ఆమె జీవితం లో కలతలు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవి విడాకుల దాకా దారితీసే అవకాశం కూడా ఉందంటూ వేణు స్వామి కొద్ది రోజుల క్రితం చెప్పారు. అయితే దాదాపు ఏడేళ్లపాటు డేటింగ్‌లో నయనతార విఘ్నేష్ శివన్ జంట ఈ ఏడాది జూన్ 9న వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏదో ఒక వివాదం నయనతారని చుట్టుముడుతూనే ఉంది. నయన్.. ‘కనెక్ట్’ సినిమాని భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించగా, ఈ మూవీ.. ఆత్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ కాగా, ఈ మూవీకి సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.
‘కనెక్ట్’ ప్రదర్శనకు స్క్రీన్స్ కేటాయించిన థియేటర్స్ ఓనర్స్ ఇప్పుడు చిత్రబృందానికి షాకిచ్చారు. 99 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శిస్తామని ప్రొడ్యూసర్ విఘ్నేష్ శివన్ గతంలో చెప్పగా, బ్రేక్ లేకపోతే.. మూవీని స్క్రీన్ చేయలేమని థియేటర్ ఓనర్స్ డైరెక్ట్ గా చెప్పేశారట. పుడ్ కోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయం కోల్పోతారని, అందుకే ఇంటర్వెల్ విషయంపై వారు గట్టిగా ఉన్నారట. ఇంటర్వెల్ బ్రేక్ గురించి నిర్మాణ సంస్థ, తమకు ముందు చెప్పలేదని.. ప్రమోషన్స్ ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని థియేటర్ యజమానులు చెబుతుండగా, ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…