Venu Swamy : న‌య‌న‌తార దంప‌తుల విష‌యంలో వేణు స్వామి చెప్పింది నిజమైందిగా..?

Venu Swamy : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నా కూడా పర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్ప‌టికే ప్ర‌భుదేవా, శింబు ప్రేమ‌లో విఫ‌ల‌మైన ఈ అమ్మ‌డు రీసెంట్‌గా విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకుంది. పెళ్లైన 4 నెలలకే కవల పిల్లకు పేరెంట్స్ అయ్యారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీళ్ళు చాలా రోజులుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇలా సరోగసి పద్ధతిలో అమ్మానాన్న అవుతారని ఎవరు ఊహించలేదు. అయితే స‌రోగసి ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మనిచ్చిన క్ర‌మంలో ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారుతుంది.

కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం సుబ్ర్మణ్యం కోరారు. త‌ప్పు చేశార‌ని తెలిస్తే ఐదు ఏళ్ల జైలు శిక్ష కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. దీనిపై నయనతార దంపతులు ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళను చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే పెళ్లి ద‌గ్గ‌ర నుండి న‌య‌న‌తార‌క వ‌రుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గ‌తంలో చెప్పారు. పెళ్లి తర్వాత నయనతార సంసార జీవితం సాఫీగా సాగదని గురువు నీచ స్థితిలో ఉండటమే ఇందుకు కారణమని వేణుస్వామి గతంలో చెప్పుకొచ్చారు.

Venu Swamy prediction about Nayanthara became true
Venu Swamy

నయనతార పెళ్లి తర్వాత ఆమె వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని నయన్ విఘ్నేష్ విడిపోతారని ఆయన తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే పెళ్లి తర్వాత నయన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.తిరుమలలో చెప్పులు ధరించి నయన్ ఫోటోషూట్ లో పాల్గొనడం వి, తన పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వడంపై కూడా ప‌లు వివాదాలు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌రోగ‌సి ద్వారార పిల్ల‌ల‌ని క‌న‌డం కూడా పెద్ద వివాదంగా మారే అవ‌కాశం క‌నిపిస్తుంది. చూస్తుంటే వేణు స్వామి జోస్యం నిజం అయ్యేలా ఉందిగా అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago