Uday Kiran : తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తన సినిమాలతో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా భయం కల్పించాడు. ఆయన చనిపోయి 8 ఏళ్ళు పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.
ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాలతో మనోడి క్రేజ్ మరింత పెరిగింది. దాంతో స్టార్ డైరెక్టర్ లు ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం క్యూ కట్టారు. ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసి మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిపించాడు ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేసేందుకు ఏకంగా 11 బడా బ్యానర్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే కొన్ని కారణాల వలన వీరి వివాహం క్యాన్సిల్ అయింది. ఉదయ్ కిరణ్ బిహేవియర్ నచ్చకపోవడం వల్లనే క్యాన్సిల్ అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
బ్రేకప్ తర్వాత ఉదయ్ కిరణ్ తో సినిమాలు ప్రకటించిన బడా బ్యానర్ లు అడ్వాన్స్ లను వెనక్కి తీసుకున్నాయి. ఆఫర్స్ తగ్గాయి. ఇక ఆయన చేసిన సినిమాలు కూడా ఫ్లాపుల బాట పట్టాయి. అయితే అదే సమయంలో ఉదయ్ కిరణ్ నిషిత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నాడు. వీరి పర్సనల్ లైఫ్‌లో కూడా అనేక వివాదాలు నడించాయి. ఇవన్నీ తట్టుకోలేక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ మరణాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…