Garikapati : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో కూడా ఎవరికి అర్ధం కాదు. ఓ సారి పొగిడిన వ్యక్తిని మళ్లీ విమర్శించడం వర్మ స్పెషాలిటీ. కొద్ది రోజులుగా గరికపాటిపై ఫుల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల జరిగిన అలయ్ బలయ్ ఈవెంట్లో చిరంజీవి మీద గరికపాటి అసహనం వ్యక్తం చేయడం, ఫోటో సెషన్లు ఆపితే.. తాను కంటిన్యూ చేస్తాను అని లేకపోతే వెళ్తాను అంటూ నోరు జారడంతో గరికపాటిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగబాబు ట్వీట్ తర్వాత ఈ ఇష్యూ చిలికి చిలికి గాలి వానలా మారింది.
అనంతరం ఈ విషయంపై నాగబాబు స్పందించి గరికపాటిని అవమానపరచాలనేది మా ఉద్దేశం కాదని మెగా అభిమానులు ఎవరు కూడా ఈ విషయంపై ఆవేశ పడకూడదు అంటూ ట్వీట్ చేశారు.ఇక ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడుతుందని అందరూ భావించగా రాంగోపాల్ వర్మ ఇదే విషయంపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించి వరుస ట్వీట్లు చేస్తూ గరికపాటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ స్పందిస్తూ చిరంజీవిని అవమానించిన అతనిని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టు ట్వీట్స్ చేస్తున్నాడు.
రీసెంట్‌గా గరికపాటి.. గడ్డిపరక. చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలుసని అనుకుంటున్నాను.. నీకు పద్మ ఎక్కువ.. పద్మ శ్రీ ఎందుకు అన్నట్టుగా గరికపాటి మీద దారుణంగా సెటైర్లు వేశాడు.తాజాగా వర్మ.. గరికపాటి నరసింహారావుపై మరో సెటైరికల్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో గరికపాటి గతంలో అనుష్క అందం గురించి మట్లాడుతున్న వీడియో ఉంది. ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది.అది ఎక్కడో కాదు అనుష్క ఫోటో దగ్గర. ఒక మంచి స్టిల్ లో అనుష్క ఫోటో పేపర్ లో ఉంది. మా అబ్బాయితో పాటు నేను కూడా చూస్తూ ఉండిపోయా అంటూ గరికపాటి కొంటెగా అనుష్క అందం గురించి ప్రస్తావించారు. గరిక పాటి సరదాగా చేసినీ వీడియోని వర్మ షేర్ చేస్తూ.. ఆహా ఓహో అంటూ కామెంట్స్ పెట్టడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…