Poori Curry : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలను తినడానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. ఈ కూరను మనం శనగపిండిని ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాం. అయితే శనగపిండికి బదులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూరను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. పుట్నాల పొడిని వేసి పూరీ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 5 లేదా రుచికి తగినన్ని, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), చిన్నగా తరిగిన బంగాళాదుంప – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, పుట్నాల పప్పు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పూరీ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ఆవాలను, ఎండు మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను, బంగాళాదుంపను, పసుపును, ఉప్పును వేసి కలిపి అవి మునిగే వరకు నీళ్లను పోసి మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల పప్పును వేసి మెత్తగా పొడి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ పొడిలో తగినన్ని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బంగాళాదుంప ముక్కలు ఉడికిన తరువాత అందులో వేసి కలిపి మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కూర తయారవుతుంది. తరచూ శనగపిండిని వేసి చేసే పూరీ కూరకు బదులుగా ఇలా పుట్నాల పొడిని వేసి చేసే పూరీ కూర కూడా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన పూరీ కూరతో పూరీలను కలిపి తినడం వల్ల చాలా రుచిగా ఉంటాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…