Venkatesh : కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ , ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ . ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్సాన్స్ రాగా, సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేశారు.
వెంకటేష్ నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ప్రేమించుకుందాం రా సినిమాలోని ఐకానిక్ సాంగ్ పెల్లికళ వచ్చేసిందే బాలా.. పల్లకిని తెచ్చేసిందే బాలా.. హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా.. అంటూ సాగే పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. ఇక ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా చేసిన లారెన్స్ డ్యాన్స్ వేస్తూ.. వెంకటేష్‌ని కూడా పిలువగా వెంకీ కూడా లారెన్స్‌తో కలిసి తన సిగ్నేచర్ స్టెప్ వేశారు. ఇక వెంకటేష్ మాట్లాడుతూ..“నా కెరీర్‌లో అత్యుత్తమ నంబర్‌ని అందించినందుకు లారెన్స్‌కి ధన్యవాదాలు. కొరియోగ్రాఫర్ స్థాయి నుంచి ఇప్పుడు టాప్ యాక్టర్‌గా ఎదిగారు. ఎస్‌జే సూర్యకు ఎనర్జీ ఉందని, నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఖుషి’ సినిమాకు దర్శకత్వం వహించినప్పటి నుంచి ఆయన తనకు తెలుసని వెంకటేష్ అన్నారు.
ఎస్‌జే సూర్య నటీనటుల నుండి గొప్ప నటనను వెలికితీస్తారు. ఇంతకుముందు ఓ సినిమాకు పని చేయాలని అనుకున్నాం. అతను అద్భుతమైన హాస్యాన్ని కలిగి ఉన్నాడు మరియు అతను నటుడిగా చాలా ఎదిగారు. ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఇక ఈవెంట్‌లో కార్తీక్ సుబ్బరాజ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రశంసలతో వెంకీ వీరాభిమానుల్లో ఎందుకనే అనుమానం మొదలైంది. వెంకీ కోసం కార్తీక్ సుబ్బరాజు ఏమైనా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. రెడీ చేస్తున్నారో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజుతో పని చేయాలనే కోరిక వెంకీ మనసులో బలంగా ఉందని టాక్ మొదలైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…