Venkatesh : స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతూ మంచి హిట్స్ అందుకుంటున్న హీరో వెంకటేష్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును తెచ్చుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు..ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన.. కొంత కాలంగా చాలా నెమ్మదిగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. అదే సమయంలో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ‘సైంధవ్’ అనే సైన్స్ ఫిక్సన్ మూవీని చేశారు. విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది.
మూవీ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహాణిశర్మలతో కలిసి స్టేజ్‌పై వెంకటేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాటకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు వెంకటేష్. ముందుగా హీరోయిన్స్ వేదికపైకి వెంకీని పిలవాలని ఆహ్వానించారు. కొంత సేపు ఆలోచించి వచ్చి డ్యాన్స్ చేశారు. రచ్చ రచ్చగా మారిన వారి డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణిశర్మతో పాటు ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్ వైఫ్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోండగా, రుహాణిశర్మ డాక్టర్‌గా కనిపించబోతున్నది.
సైంధవ్ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న 75వ మూవీ. ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సైంధవ్ సినిమాలోని డైలాగ్స్‌లోని చెప్పి అభిమానులను అలరించారు వెంకటేష్. సైంధవ్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వెంకటేష్ చెప్పాడు. యాక్షన్ సీక్వెన్స్ డిఫరెంట్‌గా ఉంటాయని అన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను పోషించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…