KA Paul : ఏపీలో అసలే ఎన్నికల వేడి ఓ రేంజ్‌లో ఉంది. ప్రతీ పార్టీ తమ అభ్యర్ధుల ఎంపికలో తల మునకలై ఉన్నాయి. కాస్తో కూస్తో సమయం దొరికితే జనంలోకి వెళ్లేందుకు ప్రతీ పార్టీ అధినేతా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మధ్య మధ్యలో తెగ రచ్చ చేస్తున్నాడు. రీసెంట్‌గా సీఎం జగన్ ను కలుస్తానంటూ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అపాయింట్ మెంట్ లేకపోయినా వచ్చేసినా పాల్.. జగన్ ను కలిస్తే కానీ వెళ్లనంటూ అక్కడ కాసేపు హల్ చల్ చేశారు. జగన్‌ను కలిసేందుకు పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు.
అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అంతకుముందు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం క్యాంప్ ఆఫీస్ వద్ద కేఏ పాల్ గంటకు పైగా వేచి చూశారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో క్యాంప్ కార్యాలయం నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం తనకు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఆయన మాజీ సీఎం అయ్యాకే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు.
ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని కొనియాడారు. అయితే జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తానని.. రహస్యాలు చెబుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో లేదా 75 సీట్లు గెలుస్తారో.. లేదా 25 సీట్లు మాత్రమే గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…