Ambati Rayudu : ఏంటి.. జ‌న‌సేనానితో రాయుడు క‌ల‌వ‌డం వెన‌క రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడా..!

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు, 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడారు. పవన్ తో అంబటి రాయుడు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? జనసేనలో చేరుతున్నారా? అనే విషయంపై ఆసక్తినెలకొంది.అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు.

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా తెలిపారు రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మరో ట్వీట్ చేశారు. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆయన జనసేనలో చేరితో పార్టీకి లాభం చేరుకుందని జనసైనికులు భావిస్తున్నారు. రాయుడు జనసేనలో చేరితో మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాయుడు…సీటు హామీ దక్కితే జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Ambati Rayudu and pawan kalyan meet interesting facts
Ambati Rayudu

గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన అంబటి రాయుడు…సీజన్ ముగియగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఏపీ రాజకీయాల్లో కొన్నాళ్ల పాటు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అంబటి రాయుడు… ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు మద్దతుగా వ్యవహరించారు. కాని ఇంత‌లో జ‌న‌సేనాని క‌ల‌వ‌డంపై ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే ప‌వ‌న్‌ని రాయుడు క‌ల‌వ‌డం వెన‌క మెగా ప‌వ‌ర్ స్టార్ ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ రావ‌లసి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago