Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ప్రస్తుతం మహేష్ హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు గుంటూరులో జరుపుకుంది. ఇక గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించడానికి కారణం సినిమా పేరు గుంటూరు కారం అవ్వడమే అంటూ చెప్పుకువచ్చారు. ఇక రెండో కారణం మహేష్ మీ వాడు, మనందరి వాడు అందుకే ఆయన మీ మధ్య ఈ ఫంక్షన్ చేయాలని షూటింగ్లో బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడని వెల్లడించారు.
విక్రమ్ వర్క్ చేసిన హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో ఉన్న అనుబంధం అయితే చెప్పలేనిది. వారు ఇద్దరు కూడా త్రివిక్రమ్ పట్ల ఒకలాంటి అభిప్రాయం తోనే ఉండడం ఇపుడు వైరల్ గా మారింది. గతంలో పవన్ తో చేసిన హ్యాట్రిక్ సినిమా అజ్ఞ్యాతవాసి సమయంలో పవన్ చెప్పిన మాటలు అలాగే ఇప్పుడు మహేష్ తో హ్యాట్రిక్ చిత్రం గుంటూరు కారం ప్రీ రిలీజ్ లో మహేష్ చెప్పిన మాటలు త్రివిక్రమ్ విషయంలో ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. వారికి మానసికంగా త్రివిక్రమ్ అందించిన స్థైర్యం కానీ వారు ఎంత సన్నిహితంగా ఉంటారో అనే అంశం కానీ పవన్ మహేష్ ల మధ్య ఒకేలా ఉన్నాయి. దీనితో ఈ పాయింట్ ఫ్యాన్స్ లో కూడా వైరల్ గా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూసే ప్రశ్న లేదని తెలిపారు. ఈ మాట చెప్పడానికి ఎవరు వెనుకాడరు. నేను అతడు, ఖలేజా సినిమాలకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజుకు కూడా అలానే ఉన్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు త్రివిక్రమ్ .. ఆయన హీరో అయి పాతికేళ్లు అవుతుందని మీరంటున్నారు కానీ నాకు మాత్రం ఆయన రెండు మూడేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడనిపిస్తుందని తెలిపారు. చూడడానికి ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడో మనసులో కూడా అంతే యంగ్ గా ఉంటాడు, పర్ఫామెన్స్ విషయంలో కూడా అంతే నూతనంగా అంతే యవ్వనంతో ఉన్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…