నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్తు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ‘వీరసింహారెడ్డి’ విడుదలకు మూడు రోజుల ముందే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
దుబాయ్‌లో ఉంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పు కునే ఉమైర్ సంధు సౌత్ ఇండియాలో విడుదలయ్యే అన్ని సినిమాలకు సంబంధించి చాలా ముందుగానే రివ్యూలు ఇచ్చేస్తుంటాడు .తమిళ సినిమాలు ‘వారిసు’, ‘తునివు’ ఫస్ట్ రివ్యూలు ఇచ్చేసిన ఆయన తాజాగా ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చాడు. బాలయ్య సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్.. సినిమాలోని అంశాల గురించి మాత్రం రెండు రకాలుగా రాసుకొచ్చాడు. సినిమాలోని కథ, కథనం కొత్తగా ఏమీ లేకపోయినా.. సినిమా మాత్రం ఎంగేజింగ్‌గా, టైమ్‌పాస్ అయ్యే విధంగా ఉంటుందని అన్నాడు.
ఇక సినిమాకు బాలకృష్ణ మూలస్తంభంలా నిలబడ్డాడని ఆయన మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించడమే కాకుండా అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పుకొచ్చాడు.. బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించడమే కాదు.. తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు పెట్టించారు. అలాగే ఈ స్టార్ హీరో డాన్సులు కుమ్మేశారు. పాటలకు ఆయన అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం. మొత్తంగా చూసుకుంటే ఇది పైసా వసూల్ మాస్ మూవీ’’ అని ఉమైర్ సంధు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలియజేశాడు.వీరసింహారెడ్డి’ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందించగా.. థమన్ సంగీతం సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…