ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం ‘శాకుతలం’ . శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమ కథ ఇది. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించగా, సమంత శాకుంతల దేవిగా నటించింది . ఈ సినిమా ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు మేకర్స్. మోహన్ బాబు దుర్వాస మహర్షి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇక శాకుంతలం సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేయగా, ట్రైలర్ చివర్లో అర్హ సింహం మీద కూర్చొని వస్తున్న షాట్ ని వేశారు. అయితే మొన్నటి వరకు శకుంతల చిన్నప్పటి క్యారెక్టర్ ని అర్హ నటిస్తుంది అనుకున్నారు. కానీ ట్రైలర్ లో అర్హ ఎంట్రీకి ఇకపై ఈ ఆర్ష ఖండం భరత ఖండంగా మారనుంది అని డైలాగ్ వేశారు. దీంతో అర్హ శకుంతల కొడుకు భరతుడి క్యారెక్టర్ లో కనిపించనుందా అనే సందేహం వస్తుంది. పురాణ పురుషుల్లో భరతుడు ఒకరు. పాండవులు, కౌరవుల పూర్వీకుడు. చంద్రవంశం కి చెందినవాడు. ఆయన పేరు ఆధారంగానే ఇండియాకు భారత్ అనే పేరొచ్చిందంటారు.
దుష్యంతుడు-శకుంతలకు జన్మించిన వీర పుత్రుడుభరతుడు కాగా, ఆ పాత్రనే అర్హ చేశారు. ఇక చిన్నప్పటి అబ్బాయిల పాత్రలు అమ్మాయిలతో చేయించడం మనం చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో అర్హ కూడా అబ్బాయి పాత్ర పోషించిందని అంటున్నారు. అర్హ క్యారెక్టర్‌పై పూర్తి క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ గ్రాండ్ గా సింహం మీద ఎంట్రీ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంతతో పాటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…