మంచు వారబ్బాయి మంచు మనోజ్ కొద్ది రోజులుగా తన పెళ్లి వ్యవహారంతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ – భూమా మౌనిక వివాహం ముహూర్తం ఖరారైందని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొత్త సినిమాల గురించి ప్రస్తావించారు. ఆ క్రమంలో ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖారారైనట్లు అభిమానులు భావించారు.
ఇక తాజాగా మంచు మనోజ్ ట్వీట్ చేశారు. మౌనిక రెడ్డి తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చేసిన ఈ ట్వీట్ లో ఆయన ”గొప్ప నాయకుడే కాదని, గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి అని.. అంతకుమించి ఒక గొప్ప మనసున్న వ్యక్తి భూమా నాగిరెడ్డి అని, ఆయన మనమధ్య లేకపోయినా ఆశీస్సులు ఎప్పుడూ మనపైనే ఉంటాయంటూ” ఎమోషనల్ ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మనోజ్ ఇలా ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. త్వరలోనే మనోజ్, మౌనిక రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అభిప్రాయ పడుతున్నారు నెటిజెన్లు.
కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. గతంలో వీరిద్దరికి పెళ్లి అయ్యి విడాకుల తీసుకున్నారు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. ఇటీవలే అహం బ్రహ్మాస్మి అనే సినిమాని ప్రకటించాడు. త్వరలోనే ఇది పట్టాలు ఎక్కనుంది. పెళ్లి తర్వాత మనోజ్ తన సినిమాల స్పీడ్ పెంచనున్నట్టు తెలుస్తుంది. మంచు ఫ్యామిలీ నుండి ఇటీవలి కాలంలో ఒక్క మంచి హిట్ రాలేదు. మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు అడపాదడపా పలకరిస్తున్నా కూడా వారి సినిమాలు మాత్రం అస్సలు హిట్ కావడం లేదు. మరి మనోజ్ అయిన మంచు ఫ్యామిలీ పరువు నిలబెట్టాలని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…