నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి గత కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్ ,ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈ క్రమంలోని ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలులో నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ చాలా స్టైలిష్ గా కనిపించాడు. గోల్డ్ కలర్ బ్లేజర్ వేసుకొని యంగ్ హీరో లాగా అందరినీ దృష్టిని ఆకర్షించాడు బాలయ్య. అయితే ఇందులో భాగంగానే నందమూరి అభిమానులు ఆయన వేసుకున్న డ్రెస్ తో పాటు ఆయన పెట్టుకున్న వాచ్ ని కూడా గమనించారు.
అందరి దృష్టి బాలయ్య వాచ్‌పై పడడంతో దీనిపై తెగ ఆరాలు తీసారు. ఇక బాలయ్య ధరించిన వాచ్ విషయానికొస్తే.. అది.. కార్టియర్ శాంటాస్ 100 స్కెలెటిన్ బ్రాండ్‌కి చెందింది.. దీని ధర.. అక్షరాలా.. రూ. 26,90,000 అన్నమాట.. బాలయ్య వాచ్ పెట్టుకున్న పిక్స్‌తో పాటు దాని రేటు గురించి నెట్టింట న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ‘కార్టియర్ సాంటోస్ 100 స్కెలెటన్’ పేరుతో ఉన్న ఈ వాచ్ ని కూతురు బ్రహ్మణి, తండ్రి బాలకృష్ణకు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే ఈ వాచ్ కు ఓ చరిత్ర ఉందట. 1847 పారిస్ లో ప్రారంభమైన కార్టియర్ సంస్థ.. అప్పటినుంచి ఎప్పటికప్పుడు యునిక్ డిజైన్స్ తో వినియోగదారుల్ని ఆకట్టుకుంటూనే ఉంది.
ఇప్పుడు బాలయ్య ఆ వాచ్ ధరించడంతో వాచ్ గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. ఇక బాలయ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’ గా బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. ఇక బాలయ్య రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, టాక్ షో, ఈమధ్య కొత్తగా యాడ్స్.. ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతూ.. 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారాయన.. ప్రొఫెషన్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్‌గా బాలయ్య స్టైలింగ్ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…