నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే ఈ సినిమాతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకుల క్రష్ గా మారిపోయింది. ఆమెను సోషల్ మీడియాలో కుర్రాళ్లు తెగ ఫాలో అయిపోతున్నారు. కొత్త పిక్ పెట్టీ పెట్టగానే లైకులు కొట్టేస్తున్నారు. అయితే ఆమెకు ఇప్పుడు తెలుగులో ఇంత ఫాలోయింగ్ వచ్చింది. అయితే హనీ రోజ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని పలకరించలేదు. దాదాపు 14 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయినగా నటించింది.
అయితే ఇప్పుడు ఆమె చేసిన ఆ తెలుగు సినిమా గురించి వెతుకులాట మొదలు పెట్టారు. వీరసింహారెడ్డి సినిమాలో హనీరోజ్ నటన, అందం, అభినయం, స్మైల్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా కాగా, ఆమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా యాడ్ చేసుకున్నారు. నిజానికి హనీరోజ్ కి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంత క్రేజ్ వచ్చింది. 2008లో శివాజీ సరసన ఆమె ఆలయం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఊహించినంత్ ఆదరణ దక్కకపోవడంతో హనీరోజ్ గురించి కూడా ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు.
వీరసింహారెడ్డి సినిమాతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. హనీరోజ్ తన 14 ఏట నుంచే యాక్టింగ్ మొదలు పెట్టింది. 2005లోనే ఆమె తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించగా, 2008లో ఆలయం సినిమాలో నటించింది. తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా కూడా చేసింది. అది కూడా ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది. తర్వాత ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాల తర్వాత హనీరోజ్ మళ్లీ తెలుగులో వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది. ఈ సినిమాతో మలయాళంలోనే కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…