టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ కొన్నాళ్లుగా తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆయన భార్య రమ్యా రఘుపతితో విబేధాలు నెలకొని ఉండగా, ఆ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. రమ్యకు వ్యతిరేకంగా నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తనను వేధిస్తోందని, హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రమ్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పెళ్లైన తొలి రోజుల నుంచే రమ్యా తనను వేధిస్తోందని, ఆమెతో కలిసి జీవించలేనని ఆయన పేర్కొన్నారు.
పెళ్లెన తర్వాతి నెల నుంచే రమ్య నన్ను వేధించేదని, ఇప్పుడు తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తన భార్య రమ్య తనను చంపడానికి కర్నాటకకు చెందిన రౌడీ షీటర్ తో రెక్కి చేయించిందని.. అలాగే ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందని.. రమ్య బంధువు అయిన మాజీ మంత్రి రఘవీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతోందని, 10 కోట్ల రూపాయిలు ఇస్తే సెటిల్ మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసిందని నరేష్ ఆమెపై తీవ్ర ఆరోపణలు గురిపించారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.
సీనియర్ దిగ్గజ నటి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతం లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నారు. వృత్తిపరంగా నరేష్ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకోని ఇద్దరితో విడాకులు తీసుకున్న, మూడో భార్య రమ్యతో విడాకులు తీసుకోవాడని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహచర నటి పవిత్రతో కలిసి ఉంటున్నారు. ఇటీవలే నరేష్- పవిత్రలు పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఓపెన్ గా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…