VC Sajjanar : తెలంగాణలో నేటి(డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ పరిధిలో టీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడినా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో తెలంగాణ పరిధిలో మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చుని ప్రభుత్వం రీఎంబర్స్ చేయనుంది.రీసెంట్‌గా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందన్నారు.
మహిళల స్వయంశక్తి మెరుగవుతుందని .. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని సజ్జనార్ ఆకాంక్షించారు. మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీని ఆదేశించారని ఆయన తెలిపారు. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం. రోజూ రాష్ట్రంలో 40లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో మహిళల సంఖ్య 12 నుంచి 14 లక్షలు. యాజమాన్యం విస్తృతంగా చర్చించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. మహిళలు సామూహిక ప్రయాణం చేసేందుకు ఉచితంగా బస్సుల అనుమతింపబడవు” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు , వృద్ధులు ప్రయాణించవచ్చని.. ఏదైనా ఒక గుర్తింపు కార్డు వుంటే చాలని సజ్జనార్ స్పష్టం చేశారు. తొలి వారం రోజులు ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయవచ్చని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో మాత్రం ఉచిత ప్రయాణం వుండదని, ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని ఎండీ చెప్పారు. అయితే టూర్స్ కి వెళ్లాలనుకునే వారికి ఇవి వర్తించవు అని సజ్జనార్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…