Etala Rajender : కేసీఆర్ నన్ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి రానివ్వ‌లేదు.. అప్పుడు ఏడ్చాన‌ని చెప్పిన ఈట‌ల‌

Etala Rajender : ఈటల రాజేంద‌ర్.. తెలంగాణ రాజ‌కీయాల‌లో ఈయ‌నకి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న‌.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి ఆర్ధికమంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవ‌స్థాప‌కుల్లో ఒకరైన ఈటెల.. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కథనరంగంలో కత్తులు దూస్తున్న రాజకీయ ప్రత్యర్థి. ఉస్మానియా విశ్వవిద్యాల‌యం నుంచి 1984లో ఈటెల రాజేందర్ బీఎస్‌సీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా.. అలాగే రెండేళ్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తన సేవలు అందించారు ఈటెల రాజేందర్.

అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్లీ గెలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో భారతీయ జనతా పార్టీ తరపున హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు ఈటెల రాజేందర్.ఏదో ఒక చోట కచ్చితంగా గెలిచి తీరుతాన‌నే ఆశాభావ వ్యక్తం చేసిన ఈట‌ల‌కి నిరాశే ఎదురైంది.రెండో చోట్ల కూడా ఆయ‌న ఓడిపోవ‌ల‌సి వ‌చ్చింది.

Etala Rajender sensational comments on cm kcr and pragathi bhavan
Etala Rajender

అయితే ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఈట‌ల కొన్ని మీడియా సంస్థ‌ల‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఆ స‌మ‌యంలో కేసీఆర్ అహంకారం గురించి చెప్పాడు. మంత్రిగా కాదు మ‌నిషిగా కూడా ఆయ‌న చూడ‌లేదు. 2016లో జ‌రిగిన సంఘ‌ట‌నని గుర్తు చేస్తూ మాట్లాడిన ఈట‌ల మా స‌మ‌స్య‌లు చెప్పేందుకు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. మ‌మ‌ల్ని పోలీసులు ఆపారు. మీడియా కెమెరాల‌న్ని మామీదే ప‌డ్డాయి. ఇజ్జ‌త్ అనిపించి క‌నీసం లోప‌లికి వెళ్లి కారు తిప్పుకొని వ‌స్తాం అని అన్నారు. అయితే అప్పుడు దానికి కూడా ప‌ర్మీష‌న్ ఇవ్వలేదు. అప్పుడు నాతో పాటు గంగుల క‌మ‌లాక‌ర్ కూడా ఉన్నాడు. ఈట‌ల రాజేంద‌ర్ ప‌రిస్థితి ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని నన్ను అడిగాడు. ఆ అవ‌మానం త‌ట్టుకోలేక ఏడుపు వ‌చ్చింది. ఏడ్చాం కూడా అని అన్నారు. అప్పుడు ఆయ‌న‌కి అంత అహంకారం ఉండేది ఈట‌ల స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం ఈట‌ల వీడియో వైర‌ల్‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago